Telangana Liquor Shops: తెలంగాణ మద్యం దుకాణాలకు వారం రోజుల్లో 447 దరఖాస్తులు
- సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
- సోమవారం నుండి దరఖాస్తులు పెరిగే అవకాశం
- అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో నిర్వాహకుల ఎంపిక
తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 26న ప్రారంభమైంది. శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 447 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల నిర్వాహకుల ఎంపిక అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫారంతో పాటు రూ. 3 లక్షల డీడీ లేదా రూ. 3 లక్షలు చలాన్ల రూపంలో చెల్లించిన రసీదును జత చేయాలి.
మొత్తం 2,620 మద్యం దుకాణాల్లో గౌడ్ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించారు. డీడీలు, చలాన్లను డీపీవో (జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి) పేరున తీయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజర్వేషన్లు, దరఖాస్తుకు సంబంధించిన ఇతర వివరాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.