Nitish Reddy: అహ్మదాబాద్ లో కొనసాగుతున్న టీమిండియా ఆధిపత్యం

Nitish Reddy Stunning Catch Video Goes Viral
  • తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 162 పరుగులకే ఆలౌట్
  • రెండో ఇన్నింగ్స్ లోనూ తడబడుతున్న విండీస్ బ్యాటర్లు
  • జడేజా, కుల్దీప్ విజృంభించడంతో 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన విండీస్
అహ్మదాబాద్‌ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ను 162 పరుగులకే కట్టడి చేసిన భారత్.. 448/5 వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీల మోత మోగించారు. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ బ్యాటర్లు తడబడుతున్నారు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై జడేజా, కుల్దీప్ విజృంభించడంతో మూడో రోజు లంచ్ సమయానికి విండీస్ 66/5తో కష్టాల్లో పడింది. భారత్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. 
 
నితీశ్ రెడ్డి కళ్లు చెదిరే క్యాచ్ 
మూడో రోజు ఆటలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి స్టన్నింగ్‌ క్యాచ్ అందుకున్నాడు. మహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో విండీస్‌ బ్యాటర్‌ తేజ్ నారాయణ్‌ చందర్‌పాల్ భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. తనవైపు వచ్చిన బంతిని నితీశ్ రెడ్డి.. గాల్లోకి ఎగిరి అద్భుతంగా ఒడిసిపట్టాడు. 
Nitish Reddy
India vs West Indies
India
West Indies
Test Match
Cricket
Amazing Catch
Tyagne Narayan Chanderpaul
Mohammed Siraj
Ahmedabad

More Telugu News