Avanigadda deaths: అవనిగడ్డలో ఒకే వార్డుకు చెందిన ముగ్గురి మృతి .. అతిసారతోనే అంటున్న ప్రజలు

Avanigadda Deaths Three Die in Same Ward Allegedly Due to Diarrhea
  • అతిసార వ్యాధి లక్షణాలతో అవనిగడ్డ 8వ వార్డుకు చెందిన ముగ్గురి మృతి
  • కలుషిత నీరే కారణమంటున్న వార్డు ప్రజలు
  • వారి మరణాలకు అతిసార కారణం కాదంటున్న జిల్లా వైద్యాధికారి
కృష్ణా జిల్లా అవనిగడ్డ 8వ వార్డులో ఒకే రోజు ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ మరణాలకు కారణం అతిసార (డయేరియా) వ్యాధి అని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగునీటి కలుషితం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు వాదిస్తున్నారు.

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో 8వ వార్డుకు చెందిన కేతేపల్లి కోటయ్య (66) శుక్రవారం ఉదయం మృతి చెందగా, అదే వార్డుకు చెందిన మునిపల్లి సరోజిని (85) మధ్యాహ్నం మరణించారు. ఆమె ఈ నెల 1 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల 29న అతిసార లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బందెల జ్ఞాన సుందర్ రావు (60) కూడా శుక్రవారం మృతి చెందారు.

కలుషిత నీటి సరఫరా..?
లంకమ్మ మాన్యం బోరు నీటిని క్లోరినేషన్ చేయకుండా నేరుగా సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నెల 22 నుంచి వార్డులో అతిసారం వ్యాప్తి చెందిందని, కుళాయిల నీరు కలుషితమైందని, తాగడానికి పనికిరాదని నివేదికలు వచ్చినా, ఆ విషయాన్ని బయటకు రాకుండా అదే నీటిని సరఫరా చేస్తున్నారని ఆ వార్డు ప్రజలు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే అతిసార వ్యాధి ప్రబలిందని వారు చెబుతున్నారు.

వార్డు ప్రజల ఆరోపణలను ఖండిస్తున్న అధికారులు
అయితే, వార్డు ప్రజల ఆరోపణలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఖండిస్తున్నారు. వారి మృతికి అతిసార కారణం కాదని చెబుతున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎ. వెంకట్రావు స్పందించారు. వైటల్స్, బీపీ పడిపోవడం వల్ల కోటయ్య మృతి చెందాడని, వృద్ధాప్యం కారణంగా సరోజిని మరణించారని వివరించారు. మరొక వ్యక్తి జ్ఞాన సుందరరావు కిడ్నీ సమస్యతో మృతి చెందినట్లు తెలిపారు. 
Avanigadda deaths
Krishna district
diarrhea outbreak
water contamination
Andhra Pradesh health
municipal water supply
Venkata Rao
health official response
cholera
public health crisis

More Telugu News