Pemmasani Chandrasekhar: మంగళగిరి వద్ద రూ.112 కోట్లతో రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం

Mangalagiri to Get Rs 112 Crore Rail Over Bridge
  • రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగుదలకు కీలక ముందడుగు
  • మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఆరు లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి
  • మంత్రి పెమ్మసాని ప్రతిపాదనతో చర్యలు చేపట్టిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మరో కీలక ముందడుగు పడింది. మంగళగిరి – కృష్ణా కాలువ రైల్వే స్టేషన్ల మధ్య రూ.112 కోట్ల వ్యయంతో ఆరు లైన్లతో నిర్మించనున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ)కి రైల్వే శాఖ అనుమతి మంజూరు చేసింది.

ఈ ఆర్ఓబీ నిర్మాణం జాతీయ రహదారి నుండి అమరావతి రాజధాని ప్రాంతంలోని ఈ13 ప్రధాన రహదారిని నేరుగా అనుసంధానించేలా వుంటుంది. మంగళగిరిలోని డాన్‌బాస్కో స్కూల్ సమీపంలో ఈ వంతెన నిర్మాణం జరగనుంది.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆరు లైన్ల ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పంపిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.

ఈ ఆర్ఓబీ నిర్మాణంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడమే కాక మంగళగిరి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాజధానికి రాకపోకలు మరింత వేగవంతమవుతాయని భావిస్తున్నారు. 
Pemmasani Chandrasekhar
Mangalagiri
Road Over Bridge
ROB Construction
Amaravati
Andhra Pradesh
Krishna Canal
Railway Over Bridge
Traffic Congestion
Six Lane ROB

More Telugu News