Donald Trump: ఆ లోగా యుద్ధం ముగించకుంటే మీకు నరకమే!: హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్

Donald Trump Sets Deadline for Hamas to End War
  • తన ప్రణాళికను అంగీకరిస్తూ హమాస్ సంతకం చేయాలన్న ట్రంప్
  • ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా ఒప్పందం కుదుర్చుకోవాలని హెచ్చరిక
  • లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ట్రంప్
యుద్ధాన్ని ముగించాలనే తన ప్రణాళికకు హమాస్ ఆమోదం తెలుపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముగింపు పలికే అంశంపై ఆయన డెడ్‌లైన్ విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా గాజా ప్రణాళికపై ఒక ఒప్పందానికి రావాలని ఆయన స్పష్టం చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో కలిసి 20 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించారు. ఈ ఒప్పందం ప్రకారం, కుదిరిన 72 గంటల్లో బందీలందరినీ హమాస్ విడుదల చేయాలి. ప్రతిగా 250 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయడంతో పాటు 1,700 మంది సాధారణ పౌరులను కూడా విడిచిపెట్టాలి.

అలాగే, గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండకూడదని, వారి ఆయుధ వ్యవస్థలను, సొరంగాలను ధ్వంసం చేయాలని ఆయన అన్నారు. ట్రంప్ ప్రతిపాదనలకు ఇజ్రాయెల్ అంగీకరించగా, హమాస్ మాత్రం దీనిపై అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇంతవరకు హమాస్ ఎటువంటి నిర్ణయం వెల్లడించకపోవడంతో ట్రంప్ తాజాగా తుది గడువు విధించారు.
Donald Trump
Hamas
Israel
Gaza
Benjamin Netanyahu
Israel Hamas war
Hostage release
Gaza plan

More Telugu News