Sharwanand: స్వచ్చదాన్ మారథాన్ రన్‌లో హీరో శర్వానంద్ సందడి

Sharwanand Participates in Swachhdaan Marathon Run
  • విజయవాడలో స్వచ్చ ఆంధ్రా కార్పోరేషన్ ఆధ్వర్యంలో స్వచ్చదాన్ పేరుతో మారథాన్ రన్ 
  • ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో శర్వానంద్
  • జీవనశైలిలో స్వచ్చతను మనం భాగం చేసుకోవాలన్న శర్వానంద్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో గురువారం నిర్వహించిన మారథాన్ రన్‌కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్ పాల్గొని సందడి చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈవెంట్‌ను ‘స్వచ్ఛదాన్’ పేరుతో నిర్వహించారు.

ఈ మారథాన్‌లో 21కే, 10కే, 5కే మీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహించగా, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 10 వేల మంది రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ మారథాన్ ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు శర్వానంద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గాంధీజీ చెప్పిన మార్గాలనే అనుసరిస్తూ మనం స్వచ్ఛతను మన జీవనశైలిలో భాగం చేసుకోవాలి. ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం నింపేలా ఉంటాయి” అని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా హి సేవ’ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇందులో భాగంగానే మారథాన్ రన్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 
Sharwanand
Swachh Bharat
Swachhata Hi Seva
Vijayawada
Swachhdaan Marathon
Andhra Pradesh
Cleanliness drive
Gandhi Jayanti
Marathon run
Indira Gandhi Municipal Stadium

More Telugu News