Allu Sirish: అల్లు వారింట త్వరలో పెళ్లి బాజాలు.. ఇంటివాడవుతున్న శిరీశ్

Allu Sirish Getting Married Soon
  • నయనికతో అల్లు శిరీశ్ నిశ్చితార్ధానికి మూహూర్తం ఖరారు
  • ఈ నెల 31న హైదరాబాద్‌లో నిశ్చితార్ధ వేడుక
  • సోషల్ మీడియా వేదికగా వెళ్లడించిన అల్లు శిరీశ్
ప్రముఖ నటుడు అల్లు శిరీశ్ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌కు చెందిన నయనికతో ఆయన నిశ్చితార్థం ఈ నెల 31న జరగనున్నట్లు శిరీశ్ స్వయంగా నిన్న సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

‘‘ఈ రోజు మా తాతగారు అల్లు రామలింగయ్య జయంతి. ఈ సందర్భంగా నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటున్నాను. అక్టోబర్ 31న నయనికతో నిశ్చితార్థం జరగనుంది. ఇటీవల మృతి చెందిన మా నానమ్మకి నా పెళ్లి చూడాలనే కోరిక ఉండేది. ఆమె ఇప్పుడు మాతో లేకపోయినా, మేము ప్రారంభించబోయే ఈ కొత్త జీవితాన్ని ఆమె పైనుంచి ఆశీర్వదిస్తారని నమ్మకం’’ అంటూ శిరీష్ భావోద్వేగపూరితమైన ప్రకటన చేశారు.

శిరీశ్, నయనిక కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కుటుంబ పెద్దల అంగీకారంతో ఈ వివాహం జరగనుంది. డిసెంబర్‌లో విదేశాల్లో వీరి వివాహ వేడుక నిర్వహించనున్నారని తెలుస్తోంది.

ఈ శుభవార్తతో అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
Allu Sirish
Allu Ramalingaiah
Nayani
Allu family
Engagement
Hyderabad
Wedding
Telugu Cinema
Actor

More Telugu News