Shivadhar Reddy: పదవీ బాధ్యతలు చేపట్టిన తెలంగాణ నూతన డీజీపీ

New Telangana DGP Shivadhar Reddy Takes Charge
  • తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి
  • రాష్ట్రానికి ఆరవ డీజీపీగా నియామకం
  • ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించిన శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రానికి ఆరవ డీజీపీగా నియమితులైన ఆయన, బుధవారం ఉదయం లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు.

1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్ రెడ్డి, తొలుత ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన తెలంగాణ క్యాడర్‌కు మారారు. ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1996 నుంచి 2000 మధ్యకాలంలో విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి సబ్ డివిజన్లలో ఏఎస్పీగా సేవలందించారు.

ఆ తర్వాత, గ్రేహౌండ్స్‌లో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కూడా ఆయన విధులు నిర్వహించారు. ముఖ్యంగా ఉగ్రవాద కదలికలను గుర్తించడంలో, వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందారు. 
Shivadhar Reddy
Telangana DGP
Telangana Police
New DGP
Telangana
IPS Officer
Telangana News
Lalitha Reddy
Telangana Government

More Telugu News