Chaitanyananda Saraswati: ‘దుబాయ్ షేక్‌కి అమ్మాయి కావాలి’.. విద్యార్థినితో దొంగ స్వామి వాట్సాప్ చాట్!

Chaitanyananda Saraswati Arrested for Sexually Harassing Students
  • విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఢిల్లీ బాబా అరెస్ట్
  • బయటకు వచ్చిన అసభ్యకర వాట్సాప్ చాట్స్
  • దుబాయ్ షేక్‌కు అమ్మాయిని చూడంటూ విద్యార్థినికి మెసేజ్
  • తనతో ఉంటే ఉచితంగా విదేశాలకు పంపిస్తానని ఆఫర్లు
ఓ మఠం ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థకు నిర్వాహకుడిగా ఉన్న ఓ దొంగ స్వామి, తన వద్ద చదువుకునే విద్యార్థినులనే లైంగికంగా వేధించిన ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనమైంది. స్వామి చైతన్యానంద సరస్వతి అనే ఈ స్వయం ప్రకటిత బాబా, విద్యార్థినులతో జరిపిన అసభ్యకర వాట్సాప్ చాటింగ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రెండు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు ఆగ్రాలో అరెస్ట్ చేశారు.

చైతన్యానంద తన విద్యాసంస్థలోని విద్యార్థినులకు అసభ్యకరమైన సందేశాలు పంపేవాడు. వారిని ‘బేబీ’ అని పిలుస్తూ, తన బెడ్రూంకు రావాలని ఆహ్వానించేవాడు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ సంభాషణలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఒక విద్యార్థినితో జరిపిన చాట్‌లో ‘దుబాయ్ షేక్‌కు ఒక సెక్స్ పార్ట్‌నర్ కావాలి, నీకు తెలిసిన మంచి అమ్మాయి ఎవరైనా ఉన్నారా?’ అని అడగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి ఆ విద్యార్థిని ‘ఎవరూ లేరు’ అని సమాధానం ఇవ్వగా, ‘అదెలా సాధ్యం? నీ క్లాస్‌మేట్ లేదా జూనియర్ ఎవరైనా?’ అని ఒత్తిడి చేశాడు.

మరో సంభాషణలో విద్యార్థిని గుడ్ నైట్ చెప్పగా ‘నాతో  బెడ్రూంకు రావా?’ అని నేరుగా అడిగాడు. ఉచితంగా విదేశీ పర్యటనలకు తీసుకెళ్తానని ఆశ చూపిస్తూ, తన మాట వినని వారిని పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 17 మంది విద్యార్థినులు ఈ స్వామిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించగా, చైతన్యానంద రెండు నెలల పాటు పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు బృందావన్, మధుర, ఆగ్రా ప్రాంతాల్లో చిన్నచిన్న హోటళ్లలో మకాం మారుస్తూ, ట్యాక్సీలలో ప్రయాణిస్తూ వచ్చాడు. చివరకు, ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.
Chaitanyananda Saraswati
Swami Chaitanyananda
sexual harassment
whatsapp chat
dubai sheik
student harassment
Agra arrest
fake baba
sexual abuse
Andhra Pradesh

More Telugu News