తొక్కిసలాట ఘటనపై హీరో విజయ్ వీడియో విడుదల.. కౌంటర్ ఇచ్చిన డీఎంకే
- ఒక వీడియో చేయడానికి నాలుగు రోజులు పట్టిందా అని నిలదీత
- పలువురి మృతికి కారణమైనందుకు విజయ్ బాధ్యత వహించాలని ఎంపీ డిమాండ్
- పోలీసుల మాట విని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న కనిమొళి
డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ, అంతా రాసుకొచ్చి మాట్లాడుతున్నారని, ఒక వీడియో చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పలువురి మృతికి కారణమైనందుకు విజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తప్పు చేశాననే భావనతోనే ఆ తొక్కిసలాట జరిగిన స్థలం నుంచి విజయ్ వెళ్లిపోయాడని డీఎంకే ఎంపీ రాజా విమర్శించారు. టీవీకే నాయకులు పోలీసుల మాట విని ఉంటే ఈ దుర్ఘటన జరగకపోయి ఉండేదని మరో ఎంపీ కనిమొళి అన్నారు.