Etela Rajender: కోర్టులో చెల్లదని తెలిసినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించారు: ఈటల రాజేందర్

Etela Rajender Criticizes 42 Percent BC Reservation Announcement
  • ఎవరిని మోసం చేయడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ప్రశ్న
  • బీహార్, మహారాష్ట్రలలో రిజర్వేషన్లపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని వెల్లడి
  • కోర్టుకు వెళ్లవద్దని మంత్రులు చెబుతున్నారు.. వెళితే అభ్యంతరమేమిటని ప్రశ్న
కోర్టులో చెల్లవని తెలిసినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించి గందరగోళానికి గురి చేస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ఎవరిని మోసం చేయడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ, బీహార్, మహారాష్ట్రలలో రిజర్వేషన్లపై నమోదైన పలు కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని అన్నారు.

ఎవరూ కోర్టుకు వెళ్లవద్దని ముగ్గురు మంత్రులు చెబుతున్నారని, కోర్టుకు వెళితే అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నానని ఈటల అన్నారు. ఎన్నికల్లో ఓటు కోసం డబ్బులు ఖర్చు పెట్టవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెబుతోందని అన్నారు. నల్గొండ జిల్లాలోని గిరిజన తండాల్లో బీసీలు లేకున్నా రిజర్వేషన్ ప్రకటించారని విమర్శించారు. తమ పార్టీ తరఫున శాసనసభలో, మండలిలో పూర్తిగా మద్దతు ఇచ్చామని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీని అనవద్దని సూచించారు.
Etela Rajender
BC Reservations
Telangana Elections
Supreme Court
Reservation Policy
Malkajgiri MP

More Telugu News