Quetta Blast: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో భారీ పేలుడు... 13 మంది మృతి!
- పారామిలిటరీ దళాలపై బాంబు దాడి
- 13 మంది మృతి, 32 మందికి పైగా గాయాలు
- దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు
పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో భారీ పేలుడు సంభవించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పారామిలిటరీ దళాలపై జరిగిన ఈ బాంబు దాడిలో కనీసం 13 మంది మృతి చెందగా, 32 మందికి పైగా గాయపడ్డారు. క్వెట్టాలోని ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే కాల్పుల మోత కూడా వినిపించింది.
ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. బలూచిస్థాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ మహమ్మద్ కాకర్ ఈ దాడిని ధృవీకరించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అయితే, బలూచ్ తిరుగుబాటు గ్రూపులు తరుచూ భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయి. ఈ దాడిని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్పరాజ్ ఖండించారు. ఇది ఉగ్రదాడి అని ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదులు పిరికి చర్యల ద్వారా దేశం యొక్క సంకల్పాన్ని బలహీనపరచలేరని ఆయన అన్నారు. ప్రజలు, భద్రతా దళాల త్యాగాలు వృధా కానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.