Irshad Malik: నేరస్థుడి బర్త్ డే పార్టీలో యూపీ పోలీసుల చిందులు.. వీడియో ఇదిగో!
- చేతిలో బీర్ సీసాతో బార్ గర్ల్ తో డ్యాన్స్
- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన అనుచరులు
- నలుగురు పోలీసులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో పేరుమోసిన నేరస్థుడు తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. మిత్రులను పిలిచి బార్ లో పార్టీ ఇచ్చాడు. పనిలోపనిగా స్థానిక పోలీసులనూ పార్టీకి ఆహ్వానించాడు. ఈ ఆహ్వానం అందుకుని నలుగురు పోలీసులు పార్టీకి హాజరయ్యారు. మద్యం తాగుతూ, బార్ గర్ల్ తో డ్యాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మండిపడ్డ ఉన్నతాధికారులు ఆ నలుగురినీ సస్పెండ్ చేశారు.
ఘజియాబాద్ లోని షాహిబాబాద్ బార్డర్ ఔట్ పోస్ట్ ఇన్ ఛార్జ్ సహా నలుగురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సోమవారం రాత్రి వారంతా స్థానిక నేరస్థుడు ఇర్షాద్ మాలిక్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న వీడియో వెలుగులోకి రావడంతో వారిని సస్పెండ్ చేశారు. ఈ వీడియోలో వారు నలుగురూ ఫుల్ జోష్ లో కనిపించడం విశేషం. చేతిలో బీర్ బాటిల్ తో మ్యూజిక్ కు అనుగుణంగా చిందులు వేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై స్థానిక డీసీపీ నిమిష్ పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్థుడు ఇచ్చిన పార్టీకి వెళ్లడమేంటని మండిపడుతూ ఆ నలుగురినీ సస్పెండ్ చేశారు.