Pawan Kalyan: కర్ణాటకలో పరిస్థితులు ఎలా ఉన్నా.. మనం కాంతార ఛాప్టర్-1కి ప్రోత్సాహం అందిద్దాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan urges support for Kantara Chapter 1 despite issues in Karnataka
  • అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న కాంతార చాప్టర్ 1 
  • తెలుగు చిత్రాలకు కర్ణాటకలో ఎదురవుతున్న సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చిన సినీ వర్గాలు
  • కాంతార చాప్టర్ 1 టికెట్ ధర పెంపు విషయంలో పునరాలోచన చేయాలంటున్న సినీ వర్గాలు
  • సోదరభావంతో ఆలోచన చేయాలన్న పవన్ కల్యాణ్
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం 'కాంతార చాప్టర్ 1' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడంలో అఖండ విజయాన్ని సాధించిన ‘కాంతార’ చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించనున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

తెలుగు చిత్రాలను కర్ణాటకలో విడుదల చేసే సమయంలో ఎదురవుతున్న సమస్యలను సినీ వర్గాలు పవన్‌ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో, ఆయన దీనిపై స్పందించారు. తాను హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమాకు కూడా కర్ణాటకలో పోస్టర్లు, బ్యానర్లు తొలగిస్తున్నారని, కష్టాలు ఎదురవుతున్నాయని తెలిపారు.

"సోదరభావంతో ఆలోచించాలి" – పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడి ప్రేక్షకులు అక్కడి చిత్రాలకు ప్రోత్సాహం ఇవ్వడం ఆపకూడదు. మంచి మనసుతో, జాతీయ భావోద్వేగాలతో ఆలోచించాలి. కన్నడ కంఠీరవ డా. రాజ్ కుమార్ నుంచి రిషబ్ శెట్టి వరకూ తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. రెండు రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్లు కలిసి చర్చించాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. కర్ణాటకలో తెలుగు సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని, 'కాంతార చాప్టర్ 1' వంటి సినిమాలకు ఆటంకాలు కల్పించకూడదని కోరుతున్నాను," అని పవన్ పేర్కొన్నారు.

తెలుగు చిత్రాలపై కర్ణాటకలో వివక్ష?

కర్ణాటకలో తెలుగు సినిమాలపై వివిధ ఆటంకాలు, పరిమితులు, టికెట్ ధరలపై నిబంధనలు అమలు అవుతున్నాయి. ‘ఆర్‌ఆర్ఆర్’, ‘గేమ్ ఛేంజర్’, ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ వంటి పెద్ద సినిమాలకు కూడా వివిధ ఇబ్బందులు ఎదురయ్యాయని, టికెట్ ధరల విషయమై హైకోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ‘కాంతార చాప్టర్ 1’ టికెట్ ధరల పెంపు విషయంలో పునరాలోచన చేయాలని సినీ వర్గాలు కోరుతున్నాయి. 
Pawan Kalyan
Kantara Chapter 1
Rishab Shetty
AP Government
Karnataka
Telugu films
Ticket prices
OG movie
Film industry
Dr Rajkumar

More Telugu News