Nara Lokesh: "లోకేశ్ అన్నా.... ఇది నీకోసమే" అంటూ తిలక్ వర్మ గిఫ్ట్... ముగ్ధుడైన నారా లోకేశ్

Nara Lokesh Touched by Tilak Varmas Gift
  • ఆసియా కప్ విజేత భారత్
  • ఫైనల్లో పాకిస్థాన్ పై అద్భుత విజయం
  • భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మ
  • నారా లోకేశ్ కు తన క్యాప్ ను కానుకగా ఇచ్చిన తెలుగు క్రికెటర్
  • తమ్ముడూ నీ చేతుల మీదుగా అందుకునేందుకు ఎదురుచూస్తుంటానన్న లోకేశ్
దుబాయ్ లో గతరాత్రి జరిగిన ఆసియా కప్-2025 ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించడం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించి 9వ సారి కప్ కైవసం చేసుకోవడంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ప్రధాన పాత్ర పోషించాడు. టాప్-3 బ్యాటర్లు పెవిలియన్ చేరిన క్రమంలో ఎంతో నిబ్బరంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

కాగా, మ్యాచ్ అనంతరం ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. తన క్యాప్ ను తిలక్ వర్మ ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు కానుకగా ఇచ్చాడు. లోకేశ్ అన్నా ఇది నీకోసమే... ప్రేమతో ఇస్తున్నాను అంటూ ఆ క్యాప్ పై రాసి సైన్ చేశాడు. ఈ మేరకు వీడియో పంపించాడు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించాడు. తిలక్ వర్మ అభిమానం తనను ముగ్ధుడ్ని చేసిందని పేర్కొన్నాడు. "తమ్ముడూ... నీ ప్రేమ పట్ల ఎంతో సంతోషిస్తున్నాను... నువ్వు భారత్ తిరిగిరాగానే ఆ క్యాప్ ను నీ చేతుల మీదుగా అందుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటాను... నువ్వు ఛాంపియన్" అంటూ ట్వీట్ చేశారు. 
Nara Lokesh
Tilak Varma
Asia Cup 2025
Team India
Pakistan
Cricket
AP IT Minister
Telugu Cricket
Dubai
Cricket Gift

More Telugu News