Nandamuri Balakrishna: చంద్రబాబు నాయకత్వంలో ఏపీ చరిత్ర దేశపటంలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది: బాలకృష్ణ

Nandamuri Balakrishna Praises Chandrababu Naidus Leadership in AP Development
  • విజయవాడ ఉత్సవ్ – 2025లో భాగంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 
  • అమరావతికి బ్రాండ్ చంద్రబాబేనన్న బాలకృష్ణ
  • అమరావతిలో నిర్మిస్తున్న బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ కొత్త హాస్పిటల్‌ను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడి
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర దేశ పటంలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ ఉత్సవ్ – 2025లో భాగంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్‌ను నిన్న బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అమరావతికి బ్రాండ్ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తోందని అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు. 11 రోజుల పాటు కనక దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరిస్తారని తెలిపారు. కళకు చావు లేదని, నేటి తరానికి కళల ప్రాముఖ్యతను వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట వంటి సంప్రదాయ కళలు కృష్ణా జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందాయని వ్యాఖ్యానించారు.

విజయవాడను సినిమాల రాజధానిగా పేర్కొంటూ, సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతోమంది కృషి చేశారని కొనియాడారు. తన తల్లి పేరుతో ప్రారంభించిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అమరావతిలో నిర్మిస్తున్న కొత్త హాస్పిటల్‌ను త్వరలో పూర్తి చేస్తామని బాలకృష్ణ వెల్లడించారు. 
Nandamuri Balakrishna
Chandrababu Naidu
Andhra Pradesh
AP Development
Vijayawada Utsav 2025
Amaravati
Basavatarakam Cancer Hospital
Telugu Desam Party
Kanakadurgamma Temple

More Telugu News