కరూర్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: పవన్ కల్యాణ్
- తమిళనాడులోని కరూర్ లో నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట
- 31 మంది దుర్మరణం
- ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
- మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం కలచివేసిందన్న పవన్
- గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేనాని
ఈ ఘటనకు సంబంధించి పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ తొక్కిసలాటలో 31 మంది మరణించారని తెలిసి షాక్‌కు గురయ్యానని తెలిపారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తమిళనాడు ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.