Vijay: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే, డీఎంకే మధ్యే పోటీ: విజయ్ కీలక వ్యాఖ్యలు

Vijay says TVK DMK will compete in 2026 Tamil Nadu elections
  • ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వనన్న విజయ్
  • అవకాశవాద ఒప్పందాలతో తమిళనాడుకు ద్రోహం చేయనని వ్యాఖ్య
  • బీజేపీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొత్తు ఉండదని స్పష్టీకరణ
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ టీవీకే పార్టీ, అధికార డీఎంకే మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన నమక్కల్‌లో మాట్లాడుతూ, డీఎంకే నెరవేరని వాగ్దానాలతో ఓటర్లను మోసం చేసిందని ఆరోపించారు. తాను ఆచరణ సాధ్యమయ్యే హామీలనే ప్రజలకు ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తాము ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అవకాశవాద ఒప్పందాలతో తమిళనాడు రాష్ట్రానికి ఎన్నటికీ ద్రోహం చేయబోమని ఆయన తేల్చి చెప్పారు. ఈరోజు డీఎంకేకు ఓటు వేస్తే అది పరోక్షంగా బీజేపీకి ఓటు వేయడమే అవుతుందని అన్నారు. అధికార డీఎంకే కేంద్ర ప్రభుత్వంతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు.

భవిష్యత్తులో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడితే రోడ్లు, పరిశుభ్రమైన తాగునీరు, ఆరోగ్య సంరక్షణ, మహిళల భద్రత వంటి ప్రాధాన్యతాంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఆచరణ యోగ్యమైన ప్రణాళికలను మాత్రమే తాము ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆకాశంలో కోటలు నిర్మించాలనే ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తరహా రోడ్లు నిర్మిస్తామని ఆచరణకు అందని హామీలు ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు.

నమక్కల్ తమిళ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన భూమి అని ఆయన అభివర్ణించారు. నమక్కల్‌కు చెందిన పి. సుబ్బరాయన్ అణగారిన వర్గాలకు రిజర్వేషన్ హక్కుల సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడారని గుర్తు చేశారు. 

Vijay
Tamil Nadu elections 2026
TVK
DMK
BJP alliance
Tamilaga Vettri Kazhagam
Namakkal

More Telugu News