Narendra Modi: ఏపీ పర్యటనకు మోదీ... చంద్రబాబు, పవన్‌తో కర్నూలులో భారీ ర్యాలీ

Modi Chandrababu Pawan Kalyan to Hold Massive Rally in Kurnool
  • అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ప్రధాని మోదీ
  • కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటన
  • శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న ప్రధాని
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్‌ 16వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు. తొలుత ఆయన శ్రీశైలం క్షేత్రానికి వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ లతో కలిసి రోడ్‌షో నిర్వహిస్తారు. జీఎస్టీ సంస్కరణల అంశంపై కూటమి నేతలు ముగ్గురూ కలిసి ఈ భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఈ వివరాలను మంత్రి నారా లోకేశ్‌.. శాసనమండలి లాబీలో ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 
Narendra Modi
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
Kurnool
Nandyala
GST Reforms
AP Politics
Srisailam Temple
Political Rally

More Telugu News