Aliens Air Lines: రూ.1499 లకే విమాన ప్రయాణం.. ఎలియన్స్ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్

Aliens Air Lines Offers Flight Tickets at Rs 1499
  • రాజమండ్రి టు తిరుపతి సర్వీసు ప్రారంభోత్సవ ఆఫర్
  • వచ్చే నెల 2, 4, 6 తేదీలలో మాత్రమే తగ్గింపు ధరలు
  • వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు
కొత్త సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఎలియన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూడు రోజుల పాటు కేవలం రూ.1,499 లకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజమండ్రి – తిరుపతి మధ్య ఎలియన్స్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులు ప్రారంభించనుంది. వచ్చే నెల 1న ఈ సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా టికెట్ ధరను తొలుత రూ.1,999 లుగా నిర్ణయించగా.. ప్రస్తుతం దానిని రూ. 1,499 లకు మార్చారు. ఈ ఆఫర్ అక్టోబరు 2, 4, 6 తేదీలలో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎలియన్స్‌ విమాన సంస్థ రాజమహేంద్రవరం మేనేజర్ తెలిపారు. వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు.

ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న ఉదయం 9:25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరిన విమానం రాజమహేంద్రవరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ఉదయం 10:15 గంటలకు మొదలవుతుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి మాత్రం ఈ విమాన సర్వీసులు మంగళవారం, గురువారం, శనివారం నాడు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7:40 కి తిరుపతి నుంచి విమానం బయలుదేరి 9:25 గంటలకు రాజమండ్రిలో ల్యాండవుతుంది. తిరిగి రాజమండ్రి నుంచి 9:50 గంటలకు బయలుదేరి 11:20 గంటలకు తిరుపతిలో ల్యాండవుతుందని తెలిపారు.
Aliens Air Lines
Aliens Air Lines offer
Rajahmundry to Tirupati flights
low cost flights
flight tickets
domestic flights India
travel offers
October flight deals
Andhra Pradesh travel
aviation news

More Telugu News