Benjamin Netanyahu: ఐరాసలో ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగం.. సీట్లు ఖాళీ చేసి వెళ్లిన పలు దేశాల సభ్యులు

Benjamin Netanyahu UN Speech Sparks Walkout
  • నెతన్యాహూ ప్రసంగం సమయంలో వాకౌట్ చేసిన ఆయా దేశాల ప్రతినిధులు
  • అనేక సీట్లు ఖాళీగా కనిపించిన దృశ్యం
  • అమెరికా సహా పలు దేశాల ప్రతినిధుల మద్దతు
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా పలు దేశాల ప్రతినిధులు వాకౌట్ చేశారు. నెతన్యాహు ప్రసంగాన్ని నిరసిస్తూ వారు వెళ్లిపోవడంతో అనేక సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అమెరికాతో పాటు పలు దేశాల ప్రతినిధులు ఆయనకు మద్దతు తెలిపారు. కొందరు కరతాళ ధ్వనులతో ఆయన ప్రసంగానికి అండగా నిలిచారు.

నెతన్యాహు ప్రసంగిస్తూ, గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ను తప్పకుండా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పాశ్చాత్య నేతలు ఒత్తిడికి లోనై ఉండవచ్చని, కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని ఆయన తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో మార్పులు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, ఆయన తన ప్రసంగంలో పలుమార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభలో ఒకవైపు చప్పట్లు, మరోవైపు వ్యతిరేకతతో కూడిన నినాదాలు వినిపించాయి.
Benjamin Netanyahu
Israel
United Nations
UN General Assembly
Gaza
Hamas
Donald Trump

More Telugu News