Pawan Kalyan: పవన్ కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓజాస్ గంభీర! 

OG Movie Special
  • భారీస్థాయిలో విడుదలైన 'ఓజీ'
  • విశేషంగా ఆకట్టుకుంటున్న ఓజాస్ గంభీర పాత్ర 
  • మరోసారి మేజిక్ చేసిన పవన్ స్టైల్
  • రికార్డు స్థాయిలో రాబడుతున్న వసూళ్లు
తెలుగు తెరపైకి చాలామంది హీరోలు వచ్చారు. అయితే తొలినాళ్లలో మాత్రమే వాళ్లు యూత్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోగలిగారు. యూత్ కూడా కొత్తగా వచ్చిన టీనేజ్ హీరోలకు అభిమానులుగా మారిపోతూ ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ విషయంలో ఈ రెగ్యులర్ ఫార్మేట్ పనిచేయలేదు. ఆయన ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇంతవరకూ యూత్ పల్స్ అలా పట్టుకుని కూర్చున్నాడు. ఆయన కదిలినా .. మెదిలినా యూత్ క్లాప్స్ బీజియమ్ గా పడిపోతూనే ఉన్నాయి.  

పవన్ తన కెరియర్లో చేసిన ప్రతి పాత్ర ఆయన బాడీ లాంగ్వేజ్ కి దగ్గరగా కనిపించడం విశేషం. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆ పాత్రలను డిజైన్ చేయడం ఆయన క్రేజ్ కి గల నిదర్శనంగా చెప్పుకోవాలి. 'బద్రీ'లో బద్రీనాథ్ .. 'ఖుషీ'లో సిద్ధూ .. జానీ .. సంజూ .. గబ్బర్ సింగ్ వంటి పాత్రలను ఇప్పటికీ యూత్ ఫాలో అవుతూ ఉండటానికి కారణం, ఆ పాత్రలు ఆయన బాడీ లాంగ్వేజ్ కి దగ్గరగా ఉండటమే. ఆ పాత్రలలో ఆయన ఒదిగిపోవడమే అని చెప్పాలి. అలాంటి పాత్రల జాబితాలోకి ఇప్పుడు 'ఓజీ'లోని 'ఓజాస్ గంభీర' పాత్ర కూడా చేరిపోయింది. రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ఈ సినిమా దూసుకుపోతోంది.     

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ .. గంభీరగా విజృంభించాడు .. విశ్వరూపం చూపించాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో, తెరపై పవన్ చేసిన విహారం .. విన్యాసం ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేసింది. జపనీస్ గురువు మాట పట్ల విశ్వాసం .. ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి పట్ల కృతజ్ఞత  .. భార్య పట్ల ప్రేమ .. కూతురు పట్ల మమకారం కలిగిన ఈ పాత్రలో పవన్ జీవించాడని చెప్పాలి. ఫ్యామిలీ అనేది రాక్షసుడిని సైతం మనిషిగా మారుస్తుంది. ఫ్యామిలీ దూరమైతే మనిషి రాక్షసుడు అవుతాడనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చిన ఈ సినిమా, పవన్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఒకటిగా నిలిచిపోతుందని చెప్పొచ్చు. 


Pawan Kalyan
OG Movie
Ojas Gambhira
Pawan Kalyan movies
Telugu cinema
Gabbhar Singh
Khushi movie
Martial arts movie
Telugu films
Tollywood

More Telugu News