Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో రైలు.. తప్పుకున్న ఎల్ అండ్ టీ!

Revanth Reddy Telangana Government to Take Over Hyderabad Metro from LT
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఎండీ మధ్య అంగీకారం
  • ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 13 వేల కోట్ల అప్పును టేకోవర్ చేయనున్న ప్రభుత్వం
  • ఎల్ అండ్ టీకి రూ. 2,100 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును తన ఆధీనంలోకి తీసుకోనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. దీని ప్రకారం మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 13 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తుంది. అంతేకాకుండా, ఎల్ అండ్ టీకి రూ. 2,100 కోట్లు నగదు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

దీని ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ వైదొలగనుంది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ. 22 వేల కోట్లతో నిర్మించారు. 69 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లతో రూపొందించిన ఈ మొదటి దశ నిత్యం 4 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అయితే ప్రయాణికుల సంఖ్య తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్టు భారంగా మారిందని ఎల్ అండ్ టీ ఇటీవల తెలిపింది. ఈ నేపథ్యంలో, మెట్రో మొదటి దశను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.
Revanth Reddy
Hyderabad Metro
Telangana Government
L&T
Metro Rail Project
Hyderabad Metro Rail
Public Private Partnership
Metro Project Debt
Hyderabad News
Telangana News

More Telugu News