టిక్కెట్ ధరల విషయంలో 'ఓజీ' కి హైకోర్టులో స్వల్ప ఊరట
- 'ఓజీ' టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి
- టిక్కెట్ ధరల పెంపుపై స్టే విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్
- సింగిల్ బెంచ్ తీర్పుపై రేపటి వరకు స్టే విధించిన డివిజన్ బెంచ్
'ఓజీ' సినిమా విడుదల నేపథ్యంలో సినీ నిర్మాతల విజ్ఞప్తి మేరకు టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ టిక్కెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు నిన్న స్టే విధించింది. బెనిఫిట్ షో టిక్కెట్ ధరలను పెంచవద్దని హైకోర్టు పేర్కొంది.