Jerusalem Mattaiah: నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు.. జెరూసలెం మత్తయ్య

Jerusalem Mattaiah Claims Revanth Reddy Threatened Suicide If He Surrendered
  • ఓటుకు నోటు కేసు ముద్దాయి సంచలన ప్రెస్ మీట్
  • రేవంత్ రెడ్డి భార్య గీతా రెడ్డి తనకు ఫోన్ చేసిందన్న మత్తయ్య
  • నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డిని టీడీపీ సస్పెండ్ చేసేదని వ్యాఖ్య
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలెం మత్తయ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు గురించిన వివరాలను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో తాను అప్పట్లోనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

అయితే, ఆ సమయంలో రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేశారని మత్తయ్య చెప్పారు. తాను సరెండర్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తారని, అదే జరిగితే ఏసీబీ ఆఫీసులోనే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటారని ఆమె చెప్పారన్నారు. దీంతో తాను వెనక్కి తగ్గానని, అనవసరంగా ఒక ప్రాణం పోవడానికి తాను ఎందుకు కారణం కావాలని భావించానని మత్తయ్య పేర్కొన్నారు.
Jerusalem Mattaiah
Revanth Reddy
Vote for Note Case
Geetha Reddy
Telangana Politics
TDP
ACB
Surrender
Controversy
Hyderabad

More Telugu News