Jayam Ravi: రూ.7.60 కోట్ల బకాయిలు.. వేలానికి నటుడు జయం రవి ఇల్లు

Actor Jayam Ravis House Faces Auction Due to Unpaid Loans
  • చెన్నైలోని నటుడు జయం రవి ఇంటికి వేలం నోటీసు
  • ప్రైవేట్ బ్యాంకు లోన్ చెల్లించకపోవడమే కారణం
  • పలుమార్లు హెచ్చరించినా స్పందించకపోవడంతో బ్యాంకు చర్యలు
  •  ఓ నిర్మాణ సంస్థతో కూడా ఆర్థిక వివాదాలు
  • ఇంటిని జప్తు చేయాలని ఆ సంస్థ కూడా అభ్యర్థన
ప్రముఖ తమిళ నటుడు జయం రవి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఇంజంబాకంలో నివసిస్తున్న ఆయన ఇంటిని ఓ ప్రైవేట్ బ్యాంకు వేలం వేయడానికి సిద్ధమైంది. తీసుకున్న రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించకపోవడంతో, బ్యాంకు అధికారులు ఆయన ఇంటికి వేలం నోటీసులు అంటించారు. ఈ ఘటన కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.

ఈ ఇంటి కోసం జయం రవి (అసలు పేరు రవి మోహన్) ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నాడు. అయితే నెలవారీ వాయిదాలను సకాలంలో చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో బకాయిలు రూ.7.60 కోట్లకు పైగా పేరుకుపోయినట్లు బ్యాంకు జారీ చేసిన నోటీసులో స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించాలని గతంలో ఎన్నోసార్లు గుర్తుచేశామని, అయినా ఆయన నుంచి స్పందన రాకపోవడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని బ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.

జయం రవి మరో వివాదంలో కూడా చిక్కుకున్నారు. 'టచ్ గోల్డ్ యూనివర్సల్' అనే నిర్మాణ సంస్థ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తమ సంస్థలో రెండు సినిమాలు చేసేందుకు గాను ఆయన రూ.6 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, కానీ ఆ చిత్రాల్లో నటించకుండా ఇతర ప్రాజెక్టులకు వెళ్లిపోయారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నటుడి ఇంటిని జప్తు చేయాలని సదరు నిర్మాణ సంస్థ కూడా కోరినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకేసారి బ్యాంకు, నిర్మాణ సంస్థల నుంచి ఒత్తిడి ఎదుర్కోవడంతో జయం రవి తీవ్ర సంక్షోభంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Jayam Ravi
Jayam Ravi house auction
Tamil actor
Ravi Mohan
Chennai property
Touch Gold Universal
loan repayment
financial crisis
Kollywood news

More Telugu News