Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'ఓజీ' చిత్రం విడుదల.. 'ఎక్స్' వేదికగా స్పందించిన లోకేశ్

Pawan Kalyan OG Movie Release Lokesh Reacts on X
  • 'ఓజీ' చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షించిన లోకేశ్
  • 'ఓజీ' అంటే పవన్ అన్న అభిమానులకు మాత్రం ఒరిజినల్ గాడ్ అని వ్యాఖ్య
  • పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు నటుడు పవన్ కల్యాణ్ ముఖ్య పాత్రలో నటించిన 'ఓజీ' చిత్రం విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.

'ఓజీ' అంటే సినిమా వరకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని, కానీ అభిమానులకు మాత్రం మా పవన్ అన్న ఒరిజినల్ గాడ్ అని ఆయన పేర్కొన్నారు. పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' చిత్రం విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని రాసుకొచ్చారు. లోకేశ్ చేసిన ఈ ట్వీట్‌ను జనసేన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ రీట్వీట్ చేసింది. కాగా, ఓజీ చిత్రం విడుదల సందర్భంగా పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు

ఈరోజు రాత్రి 10 గంటలకు 'ఓజీ' ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. టిక్కెట్ ఉన్నవారికే థియేటర్‌లోకి ప్రవేశం ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ఎలాంటి సంబరాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉండవని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ప్రకటనతో పవన్ కల్యాణ్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.
Pawan Kalyan
OG Movie
Nara Lokesh
Original Gangster
Janasena
Telugu Cinema

More Telugu News