Edupayala Vana Durga Temple: జలదిగ్బంధంలోనే ఏడుపాయల వనదుర్గ ఆలయం

Edupayala Vana Durga Temple submerged in floodwaters
  • భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుండి పోటెత్తిన వరద
  • వనదుర్గ ఆనకట్ట నుంచి 59,805 క్యూసెక్కుల వరద ఉద్ధృతి
  • రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఉత్సవాలు నిర్వహిస్తున్న అర్చకులు
మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరగడంతో, వనదుర్గ ఆనకట్ట నుండి 59,805 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

దీని కారణంగా అర్చకులు గర్భగుడిని తాత్కాలికంగా మూసివేసి, రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ తెలిపారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఏడుపాయల వనదుర్గ ఆలయం జలదిగ్బంధంలో కొనసాగుతోంది.
Edupayala Vana Durga Temple
Edupayala
Vana Durga Temple
Medak
Telangana Temples
Flooding

More Telugu News