Pawan Kalyan: ఈ రేంజ్ లో అంచనాలు పెంచిన సినిమా 'ఓజీ'నే!

OG Movie Special
  • రేపు విడుదలవుతున్న 'ఓజీ'
  • అడ్వాన్స్ బుకింగ్స్ ను అదరగొట్టిన క్రేజ్
  • పవన్ మార్క్ కంటెంట్ 
  • ఓపెనింగ్స్ పై అభిమానుల్లో అంచనాలు   

పవన్ కల్యాణ్ అనేది ఒక పేరు కాదు .. మంత్రం అని యూత్ ఎప్పుడో చెప్పింది. ఆయన స్టైల్ ఫుల్ ఎనర్జీని ఇచ్చే ఒక టానిక్ లా పనిచేస్తుందని చాలామంది ఎప్పుడో సెలవిచ్చారు. అప్పటి నుంచి ఆ జోరు అలా కొనసాగుతూనే ఉంది. బ్యానర్ ఏదైనా .. దర్శకుడు ఎవరైనా పవన్ సినిమా వస్తుందంటే చాలు .. ఒక పండుగ వస్తున్నట్టే అభిమానులు ఫీలవుతూ ఉంటారు. టికెట్ రేటు ఎంతయినా ఫర్లేదు .. థియేటర్లో సీటు ఏ మూలనున్న ఫర్లేదు అనుకుంటారు.

అలాంటి పవన్ కల్యాణ్ నుంచి రేపు 'ఓజీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ బడ్జెట్ తో బరిలోకి దిగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ సుడిగాలిని .. సునామినీ గుర్తుచేశాయి.  పవన్ సరసన నాయికగా ప్రియాంక మోహన్ నటించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. ప్రీ రిలీజ్ ఈవెంటు తరువాత, ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇమ్రాన్ హష్మీ .. ప్రకాశ్ రాజ్ .. అర్జున్ దాస్ .. శ్రియా రెడ్డి పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి.

 సుజీత్ అల్లుకున్న కథాకథనాలు ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  'ఓజాస్ గంభీరా'గా పవన్ మార్క్ నటన .. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు, యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెబుతున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా ఒక కొత్త మార్క్ ను సెట్ చేయడం మాత్రం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. 

Pawan Kalyan
OG Movie
Sujeeth
Priyanka Mohan
Thaman
Imran Hashmi
Prakash Raj
Telugu Cinema
Action Movie

More Telugu News