Nara Lokesh: మెగా డీఎస్సీ వేడుకకు జగన్‌ను పిలుస్తాం: నారా లోకేశ్

Nara Lokesh says he will Invite Jagan for Mega DSC Event
  • మెగా డీఎస్సీ ద్వారా 16,000 మంది టీచర్ల ఎంపిక పూర్తి
  • ఉత్తీర్ణులైన వారికి నియామక పత్రాలు అందించేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు
  • ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,000 మంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపికైన సంగతి తెలిసిందే. వీరందరికీ నియామక పత్రాలను ఒకే వేదికపై అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకలా ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 16,000 మంది ఉపాధ్యాయులకు త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తాము. ఈ కార్యక్రమానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ను కూడా ఆహ్వానిస్తాము" అని పేర్కొన్నారు.
Nara Lokesh
Jagan
Jagan Mohan Reddy
Mega DSC
Andhra Pradesh
AP DSC
Teacher Recruitment
AP Government
Pulivendula
TDP

More Telugu News