Nara Chandrababu Naidu: మంత్రి రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు, లోకేశ్

Nara Chandrababu Naidu Attends Minister Ramanayudu Daughters Wedding
  • పాలకొల్లులోని బ్రాడీపేట బైపాస్ రోడ్డు ప్రాంతంలో కల్యాణం
  • వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి, మంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బ్రాడిపేట బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్ద నూతన వధూవరులు శ్రీజ, దుర్గా హరిహర సాయి పవన్ కుమార్‌లను ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించారు.

వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు మంత్రి నారా లోకేశ్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Nara Chandrababu Naidu
Nimmala Ramanayudu
Andhra Pradesh
Nara Lokesh
Marriage

More Telugu News