TSPSC Group 1: గ్రూప్-1 అంశంపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సంచలన తీర్పు
- టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట
- సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన హైకోర్టు
- తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 వివాదంపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది.
గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది. తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేయగా డివిజనల్ బెంచ్ ఈ రోజు విచారించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.