సరికొత్త రికార్డుకు చేరుకున్న బంగారం ధర.. ఈ క్యాలెండర్ ఏడాదిలో రూ.40 వేలు పెరిగిన ధర
- ఢిల్లీలో రూ. 2,700 పెరిగి రూ. 1,18,900 చేరుకున్న బంగారం ధర
- క్యాలెండర్ ఏడాదిలో 50.60 శాతం పెరిగిన పసిడి ధర
- రూ. 1,39,600కు చేరిన వెండి ధర
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వల్లనే బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 39,950 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31 బంగారం ధర రూ. 78,950 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.
వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కిలో వెండి రూ. 3,220 పెరిగి రూ. 1,39,600కు చేరి, సరికొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో వెండి ధర ఏకంగా రూ.49,900 పెరిగింది. డిసెంబర్ 31న వెండి ధర రూ. 89,700గా ఉంది. మరోవైపు, డాలర్ మారకంతో రూపాయి మంగళవారం 47 పైసలు క్షీణించి 88.75కు పడిపోయింది.