Subhash: ఉద్యోగానికి ఎసరు పెట్టిన ఎఫ్ బీ పోస్టు

GST Officer Subhash Faces Action Over Amaravati Facebook Post
  • తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై ప్రభుత్వం వేటు
  • రాజధాని మునిగిపోయిందంటూ ఫేస్ బుక్ లో పోస్ట్
  • అమరావతిపై విషం చిమ్ముతున్నారంటూ సస్పెండ్ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరదల్లో మునిగిపోయిందంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై ప్రభుత్వం వేటు వేసింది. రాజధానిపై విషం చిమ్ముతున్నారని ఆరోపిస్తూ సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతిలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలతో తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.

దీనికి అమరావతి మునిగిపోయిందని క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ కాస్తా వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సుభాష్ పై నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. సుభాష్ ను వివరణ కోరింది. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని సుభాష్ వివరణ ఇచ్చారు. ఆయన సమాధానం పట్ల సంతృప్తి చెందని కూటమి ప్రభుత్వం.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ నుంచి సుభాష్ ను తొలగించింది.
Subhash
GST Assistant Commissioner
Amaravati
Andhra Pradesh
Facebook post
Suspension
Floods
Government action
Social media controversy

More Telugu News