Sourav Ganguly: ఆరేళ్ల తర్వాత మళ్లీ క్యాబ్ అధ్యక్షుడుగా ఎన్నికైన సౌరభ్ గంగూలీ
- నిన్న జరిగిన క్యాబ్ 94వ వార్షిక సర్యసభ్య సమావేశం
- అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీ
- తన దృష్టి ఈడెన్ గార్డెన్స్ అభివృద్ధిపైనే ఉండనుందన్న సౌరభ్ గంగూలీ
భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన సౌరభ్ గంగూలీ మళ్ళీ బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన క్యాబ్ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో గంగూలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో 2015 నుంచి 2019 వరకు ఈ పదవిలో కొనసాగిన గంగూలీ, ఆరేళ్ళ విరామం తర్వాత మళ్ళీ ఆ పదవికి ఎన్నికయ్యారు.
ఈడెన్ గార్డెన్స్ అభివృద్ధిపై దృష్టి
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. క్యాబ్ అధ్యక్షుడిగా తన దృష్టి ఈడెన్ గార్డెన్స్ అభివృద్ధిపైనే ఉండనుందని చెప్పారు. ప్రస్తుతం 68,000గా ఉన్న ఈ స్టేడియం సీటింగ్ సామర్థ్యాన్ని తిరిగి లక్షకు పెంచేందుకు ప్రయత్నాలు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమాన్ని 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాత చేపడతామని స్పష్టం చేశారు.
భారత్ – దక్షిణాఫ్రికా మధ్య టెస్టు మ్యాచ్‌కు ఈడెన్ సిద్ధం
గంగూలీ అధ్యక్షతన క్యాబ్ ముందుగా అధిగమించాల్సిన ముఖ్యమైన కార్యక్రమాల్లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ నిర్వహణ ఒకటి. ఈ మ్యాచ్ ఈ ఏడాది నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఇది ఈడెన్ గార్డెన్స్‌లో ఆరేళ్ళ విరామం తర్వాత జరగనున్న టెస్టు మ్యాచ్ కావడం విశేషం. చివరిసారి ఇక్కడ 2019లో భారత్ – బంగ్లాదేశ్ మధ్య డే/నైట్ టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పట్లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. "రెండూ అగ్రశ్రేణి జట్లు. ఇది మంచి టెస్టు మ్యాచ్ అవుతుంది. మ్యాచ్‌కి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఏర్పాట్లపై త్వరలో బీసీసీఐతో చర్చిస్తా," అని తెలిపారు.