Nara Lokesh: పెద్దల పట్ల లోకేశ్ వినయం... స్పీకర్ ను కారు వరకు వెళ్లి సాగనంపిన దృశ్యం

Nara Lokesh shows respect to elders escorts speaker to car
  • ఏపీ అసెంబ్లీ వద్ద ఆసక్తికర సన్నివేశం
  • స్పీకర్ అయ్యన్నను కారు వరకు తొడ్కొని వెళ్లిన మంత్రి నారా లోకేశ్
  • స్పీకర్ వారించినా లోకేశ్ కారు వరకు వెళ్లి అభివాదం చేసిన లోకేశ్
ఏపీ అసెంబ్లీ స్పీకర్, సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పట్ల మంత్రి నారా లోకేశ్ తనకున్న గౌరవాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీ నుంచి స్పీకర్ అయ్యన్నపాత్రుడు బయటకు వెళ్తుండగా లాబీలో మంత్రి నారా లోకేశ్ ఎదురుపడ్డారు.

ఈ సందర్భంగా స్పీకర్ వెంట లోకేశ్ వాహనం వరకు వెళ్లారు. మొదట తనతో కారు వరకు రావాల్సిన అవసరం లేదని స్పీకర్ అయ్యన్న లోకేశ్‌ను వారించారు. అయినప్పటికీ లోకేశ్ అనుసరించడంతో స్పీకర్ ఆయన చేయి పట్టుకుని వారించారు. లోకేశ్ వినకుండా దగ్గర ఉండి కారు ఎక్కించి అభివాదం చేసి తన గౌరవాన్ని చాటుకున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశాన్ని ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. 
Nara Lokesh
Chintakayala Ayyanna Patrudu
AP Assembly
Andhra Pradesh Assembly
AP Speaker
Telugu Desam Party
TDP
Political News
Andhra Pradesh Politics

More Telugu News