హైదరాబాద్‌లో భారీ వర్షం.. వరద నీటిలో కొట్టుకుపోయిన కార్లు, ద్విచక్ర వాహనాలు
- మెహదీపట్నం, టోలీచౌకి, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వాహనాలు
- లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు
- మెహిదీపట్నం నుండి ఎన్ఎండీసీకి 40 నిమిషాల సమయం!
భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సాయంత్రం మెహిదీపట్నం నుంచి ఎన్ఎండీసీకి చేరుకోవడానికి సుమారు 40 నిమిషాల సమయం పట్టింది. పలు కూడళ్లలో వాహనాలు బారులు తీరడంతో కిలోమీటర్ల మేర నెమ్మదిగా కదులుతున్నాయి. టోలీచౌకీ, హకీంపేట ప్రాంతాల్లో కొన్ని గోడలు కూలిపోయాయి.