Vasundhara Devi: బల్కంపేట రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్న బాలకృష్ణ అర్ధాంగి వసుంధర

Vasundhara Devi Visits Balkampet Renuka Yellamma Temple
  • హైదరాబాద్‌లోని బల్కంపేటలో కొలువైన అమ్మవారు
  • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వసుంధర
  • అమ్మవారి తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు
ప్రముఖ సినీనటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర దేవి సోమవారం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆమె ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న వసుంధర దేవికి దేవాలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆమె గర్భగుడిలో కొలువై ఉన్న ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక అర్చనలు జరిపించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వసుంధరకు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Vasundhara Devi
Balkampet Yellamma Temple
Balakrishna wife
Hyderabad temples

More Telugu News