Fakhar Zaman: ఫఖర్ జమాన్ క్యాచ్ ఔట్ వివాదం.. తాజా వీడియో ఇదిగో!

Fakhar Zaman Catch Out Controversy Latest Video
  • బంతిని నేలను తాకిందని వాదిస్తున్న పాక్ ఆటగాళ్లు
  • అంపైరింగ్ వ్యవస్థ భారత్ కు అనుకూలంగా ఉందని ఆరోపణ
  • బంతి కింద కీపర్ గ్లోవ్ ఉన్నట్లు తాజా వీడియోలో స్పష్టత
ఆసియా కప్ టోర్నీలో భాగంగా జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టును టీమిండియా చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ క్యాచ్ ఔట్ పై వివాదం రేగుతోంది. జమాన్ నాటౌట్ అని, థర్డ్ అంపైర్ నిర్ణయం సరికాదని పాక్ ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. పాక్ జట్టు మాజీ ఆటగాళ్లు కూడా అందుకు వంతపాడుతున్నారు. అంపైరింగ్‌ వ్యవస్థ భారత్‌కు అనుకూలంగా ఉందని విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ వివాదానికి కారణమైన క్యాచ్ ఔట్ కు సంబంధించి తాజాగా ఓ వీడియోలో పూర్తి స్పష్టత వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో క్యాచ్ ఔట్ సరైందేనని తేలింది.
 
అసలు ఏంజరిగిందంటే..
ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో హార్దిక్‌ పాండ్యా వేసిన బంతిని ఆడబోయిన ఫఖర్ జమాన్ కీపర్ సంజు శాంసన్ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్యాచ్ పై స్పష్టత కొరవడడంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ ను ఆశ్రయించారు. వివిధ కోణాల్లో పరిశీలించిన థర్డ్‌ అంపైర్ చివరికి ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై పాక్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. బంతి ముందుగా నేలను తాకిందని, ఆ తర్వాత కీపర్ చేతుల్లోకి వెళ్లిందని వాదిస్తున్నారు. అయితే, తాజాగా బయటకు వచ్చిన వీడియోలో బంతి నేలను తాకలేదని, శాంసన్ గ్లోవ్ ను తాకిందని స్పష్టమైంది.
Fakhar Zaman
Fakhar Zaman catch
Asia Cup 2023
India vs Pakistan
Sanju Samson catch
Hardik Pandya
Pakistan cricket
cricket controversy
third umpire decision
catch controversy

More Telugu News