Khyber Pakhtunkhwa: సొంత భూభాగంపై పాక్ సైన్యం వైమానిక దాడి.. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 30 మంది పౌరులు హతం

Pakistan Military Airstrike on Khyber Pakhtunkhwa Kills Civilians
  • కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ లో భాగంగా ఓ గ్రామంపై సైన్యం దాడి
  • మృతుల్లో మహిళలు, చిన్నారులు
  • ఇళ్ల శిథిలాల కింద మరింతమంది చిక్కుకుని ఉండవచ్చని సందేహాలు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం
పాకిస్థాన్ సైన్యం సొంత భూభాగంలోనే వైమానిక దాడులకు పాల్పడింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఓ గ్రామంపై మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో 8 బాంబులు జారవిడిచింది. ఈ దాడిలో దాదాపు 30 మంది పౌరులు మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన కలవరపరిచే దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరాహ్ వ్యాలీలోని మాత్రె ధారా గ్రామంపై జరిగిన ఈ దాడిలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.

ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ ప్రావిన్స్ లో ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 605 ఉగ్రవాద దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 138 మంది సామాన్యులు, 79 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఒక్క ఆగస్టు నెలలోనే 129 ఉగ్ర దాడులు జరిగాయని, ఈ ఘటనల్లో ఆరుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు.
Khyber Pakhtunkhwa
Pakistan airstrike
Pakistan army
Khyber Pakhtunkhwa attack
Pakistan terrorism
Tirah Valley
Matre Dhara village
Pakistan civilian deaths
Pakistan military action
Terrorist attacks Pakistan

More Telugu News