Pawan Kalyan: కత్తితో పవన్ ఎంట్రీ.. సెక్యూరిటీకి వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో!

Pawan Kalyan Sword Entry at OG Event Sparks Controversy
  • హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుక
  • చేతిలో కత్తి పట్టుకుని వేదికపైకి పవన్ కల్యాణ్ గ్రాండ్ ఎంట్రీ
  • కత్తి తిప్పుతుండగా భద్రతా సిబ్బందికి త్రుటిలో తప్పిన ప్రమాదం
  • తాను డిప్యూటీ సీఎం అనే విషయం మరిచిపోయానన్న పవన్
  • ఖుషి తర్వాత అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా ఇదేనని వ్యాఖ్య
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో స్టేడియం ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ఈ వేడుకలో చేతిలో కత్తి పట్టుకుని పవన్ కల్యాణ్ వేదికపైకి ప్రవేశించిన తీరు అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే, ఈ క్రమంలో ఓ ఊహించని సంఘటన చర్చనీయాంశంగా మారింది.

వేదికపై పవన్ కత్తిని తిప్పుతున్న సమయంలో అది ఆయన వెనుక ఉన్న భద్రతా సిబ్బందికి అత్యంత సమీపం నుంచి వెళ్లింది. వెంట్రుకవాసిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు దీన్ని పవన్ స్టైల్, ఎలివేషన్ అంటూ సంబరపడుతుండగా, ఇలాంటి విన్యాసాలు ప్రమాదకరమంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తన ప్రసంగంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. “ఈ సినిమా షూటింగ్‌లో నేను ఎంతగా లీనమయ్యానంటే, డిప్యూటీ సీఎం నన్న విషయమే మర్చిపోయాను” అని ఆయన వ్యాఖ్యానించారు. దర్శకుడు సుజీత్ తనకు పెద్ద అభిమాని అని, కథను ముక్కలుగా చెప్పినా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసించారు. సంగీత దర్శకుడు త‌మన్ ఈ సినిమాకు మరో హీరో అని కొనియాడారు.

“‘ఖుషి’ తర్వాత నా అభిమానులు మళ్లీ అలాంటి ఒక సినిమా కోసం ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఆ సినిమానే ఈ ‘ఓజీ’” అంటూ పవన్ చెప్పిన మాటలకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. “దర్శకుడు సుజీత్ టీమ్ చాలా గొప్పది. కెరీర్ ఆరంభం నుంచే నాకు ఇలాంటి టీమ్ ఉండి ఉంటే, నేను రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదేమో” అంటూ సుజీత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ పవర్‌ఫుల్ మ్యానరిజమ్స్, సుజీత్ టేకింగ్, త‌మన్ సంగీతం సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
Pawan Kalyan
OG movie
Pawan Kalyan OG
LB Stadium
Sujeeth
Thaman
Hyderabad
pre release event
political criticism
Tollywood

More Telugu News