Abhishek Sharma: సెంచరీ చేస్తాడనుకున్నా.. అభిషేక్ శర్మ తల్లి

Abhishek Sharmas Mother Reacts to Near Century in Asia Cup
  • తొలి బంతికే సిక్స్ కొట్టడం మరిచిపోలేమని వ్యాఖ్య
  • ఈ టోర్నీలో తప్పకుండా సెంచరీ చూస్తామని ఆశిస్తున్నట్లు వెల్లడి
  • దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించిన అభిషేక్ తల్లి, సోదరి
ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్ తో నిన్న జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ను ఆస్వాదించామని బ్యాటర్ తల్లి మంజు శర్మ పేర్కొన్నారు. తొలి బంతినే అభిషేక్ సిక్స్ గా మలచడం మరిచిపోలేమని అన్నారు. ఈ మ్యాచ్ లో అభి సెంచరీ చేస్తాడని భావించానని ఆమె తెలిపారు. దుబాయ్ లో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించిన మంజు శర్మ, అభిషేక్ సోదరి కోమలి శర్మ అనంతరం మీడియాతో మాట్లాడారు. అభి సెంచరీ చేజార్చుకోవడం కాస్త నిరాశ కలిగించిందని మంజు శర్మ చెప్పారు. అయితే, ఈ టోర్నమెంట్ లో అభి సెంచరీ చేస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

అభిమానుల మద్దతు ఇలాగే కొనసాగితే దేశం కోసం అభిషేక్ మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పారు. అభిషేక్ శర్మ తండ్రి కోమల్ శర్మ మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన ప్రతీ మ్యాచ్‌ చూడాలని తాను అనుకుంటానని చెప్పారు. పాకిస్థాన్ పై అభిషేక్ ఇన్నింగ్స్ చూశాక చాలా సంతోషంగా ఉందని అన్నారు. అభి అద్భుతమైన టాలెంట్ కలిగిన ప్లేయర్ అని, అతడికి ఆకాశమే హద్దని చెప్పారు. ఈ టోర్నీలో అభి సెంచరీ చూడాలని ఎదురుచూస్తున్నట్లు కోమల్ శర్మ తెలిపారు.
Abhishek Sharma
Abhishek Sharma Asia Cup
Asia Cup 2024
India vs Pakistan
Manju Sharma
Komal Sharma
Cricket
Indian Cricket Team
Dubai Cricket Match

More Telugu News