Rajababu: డబ్బులో సుఖం లేదని రాజబాబు ఏడ్చేవాడు: నటుడు చిట్టిబాబు

Chitti Babu Interview
  • రాజబాబు గురించి ప్రస్తావించిన చిట్టిబాబు
  • బంగాళా - కారు కొన్నప్పటి రోజులు  
  • డబ్బు వచ్చాక ఆయన కంటి నిండా నిద్రపోలేదని వెల్లడి
  • డబ్బు వలన కష్టాలే ఎక్కువనేవాడని వ్యాఖ్య

తెలుగు తెరపై హాస్యనటుడిగా రాజబాబు చెరగని సంతకం చేశారు. రాజబాబు డైలాగ్ డెలివెరీ .. బాడీ లాంగ్వేజ్ ఆయనకి విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అలాంటి రాజబాబును గురించి ఆయన తమ్ముడు చిట్టిబాబు 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. "రాజబాబు కెరియర్ పరంగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్లాడు. 'సర్కార్ ఎక్స్ ప్రెస్' సినిమాతో ఆయన క్రేజ్ ఒక రేంజ్ కి వెళ్లిపోయింది. కృష్ణగారు హీరోగా నటించిన ఆ సినిమా సమయంలోనే అన్నయ్య సొంత ఇల్లు కొన్నాడు" అని అన్నారు. 

" సొంతంగా పెద్ద బంగళా కొన్న తరువాత, మళ్లీ పైన కొన్ని గదులు వేశాడు. ఆ తరువాత కారు కొన్నాడు.  బంగారం కూడా కొంటూ వెళ్లాడు. ఆ తరువాత ఒక కాపలా కుక్కను తీసుకొచ్చాడు .. అలాగే ఇంటి బయట ఒక గూర్ఖాను పెట్టుకున్నాడు. డబ్బు వచ్చినప్పటి నుంచి అన్నయ్య సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. రాత్రివేళలో నా రూముకి వచ్చి నిద్రపట్టడం లేదని అనేవాడు. నా నిద్ర పాడు చేసేవాడు. గూర్ఖా మెలకువతో ఉన్నాడా .. నిద్రపోతున్నాడా? అని చెక్ చేసేవాడు. అప్పుడు నేను అద్దె ఇంట్లో హాయిగా ఉన్న రోజులను అన్నయ్యకి గుర్తుచేసేవాడిని" అని చెప్పారు. 

'అన్నయ్యా  సంపాదన ఎక్కువైపోతే, గూర్ఖా కాపలా కాస్తున్నాడా లేదా అని అతనికి మనం కాపలా కాసే పరిస్థితి వచ్చిందే' అని అనేవాడిని. డబ్బులో సుఖం లేదురా అని అన్నయ్య అనేవాడు. సుఖాన్ని ఇవ్వని డబ్బు వేస్టు అనే చెప్పేవాడు. డబ్బు ఎక్కువైతే కష్టమే .. అదే ఇబ్బందులు పెడుతూ ఉంటుందని అనేవాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం చెప్పులు గానీ ..బట్టలుగాని పెద్ద సైజ్ లో తీసుకోము. తీసుకుంటే ఇబ్బంది పడతాము. అలాగే డబ్బు కూడా మన అవసరాలకి తగినంత ఉండటమే మంచిది" అని చెప్పారు. 

Rajababu
Chitti Babu
Telugu cinema
comedian
Suman TV interview
Sarkar Express movie
actor
Rajababu brother
Telugu film industry
money and happiness

More Telugu News