Bapatla accident: బాపట్ల జిల్లాలో డివైడర్‌ను ఢీకొన్న కారు .. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

Bapatla Accident Three family members died in car accident
  • కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు
  • బాపట్ల జిల్లా మార్టూరు మండలం కొలలపూడి గ్రామం వద్ద ఘటన 
  • తిరుపతి నుంచి పిఠాపురానికి వెళుతుండగా ప్రమాదం
బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

తిరుపతి నుంచి పిఠాపురానికి వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అతివేగం, కుక్క అడ్డురావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్ (25)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Bapatla accident
Andhra Pradesh road accident
Marturu accident
Kolalapudi accident
Road accident death
Car accident India
Tirupati to Pithapuram
Highway accident
Andhra Pradesh police

More Telugu News