Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

Revanth Reddy reviews local body elections
  • స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతున్న తెలంగాణ సర్కార్
  • సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

తెలంగాణ హైకోర్టు ఇటీవల సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను వేగంగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
Revanth Reddy
Telangana local body elections
Telangana elections
BC reservations
High Court
Mahesh Kumar Goud
Mallu Bhatti Vikramarka
Uttam Kumar Reddy

More Telugu News