Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల గంజాయి స్వాధీనం

Shamshabad Airport 12 Crore Ganja Seized
  • సంచిలో కోట్లాది రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి తరలింపు
  • దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద నుండి స్వాధీనం
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ. 12 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక సంచిలో తరలిస్తున్న భారీ విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికురాలి వద్ద దీనిని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి తరలించిన ప్రయాణికురాలిని ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. హైడ్రోఫోనిక్ గంజాయి ఒక నిషేధిత మత్తు పదార్థం. దీని అక్రమ రవాణా, నిల్వ, విక్రయంపై భారతదేశంలో కఠినమైన శిక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేరం యొక్క తీవ్రతను బట్టి కోర్టు విచారణ కొనసాగుతోంది.
Shamshabad Airport
Shamshabad Airport ganja seizure
Hyderabad airport drug bust
DRI Hyderabad

More Telugu News