సాయి భక్తుల కోసం ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- రూ.5 వేలకే షిర్డీ యాత్ర.. రెండు రోజుల టూర్
- రానూపోనూ ప్రయాణం, షిర్డీలో వసతి సదుపాయం
- హోటల్ నుంచి ఆలయం వరకూ వాహనం ఏర్పాటు
ప్రతీ బుధవారం..
కాచిగూడ నుంచి బుధవారం సాయంత్రం 6.40 గంటలకు 17064 రైలు (అజంతా ఎక్స్‌ప్రెస్) ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణించి గురువారం ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వేస్టేషన్ చేరుకుంటారు. ఐఆర్ సీటీసీ సిబ్బంది ప్రత్యేక వాహనంలో షిర్డీలో హోటల్ కు తీసుకెళ్లి, రెడీ అయ్యాక ఆలయ సందర్శనకు తీసుకెళతారు. దర్శనం టికెట్ ఖర్చు ప్యాకేజీలో భాగం కాదు కాబట్టి సొంతంగా కొనుగోలు చేయాలి.
దర్శనం తర్వాత హోటల్ కు చేరుకుని కాసేపు విశ్రమించే వీలుంటుంది. సాయంత్రం 5 గంటలకు చెక్ అవుట్.. అక్కడి నుంచి తిరిగి నాగర్‌సోల్ స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 8.30 గంటలకు 17063 రైలు ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణించి శుక్రవారం ఉదయం 9.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటారు.
ఛార్జీలు.. కంఫర్ట్ ప్యాకేజీ..
3 ఏసీలో ప్రయాణం. రూమ్‌కు రూ.7,890 (సింగిల్ షేరింగ్), రూ.6,660 (డబుల్ షేరింగ్), రూ.6,640 (ట్రిపుల్ షేరింగ్). 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.5,730 (విత్ బెడ్), రూ.5,420(విత్‌అవుట్ బెడ్).
స్టాండర్డ్ ప్యాకేజీలో..
రూమ్‌కు రూ.6,220 (సింగిల్ షేరింగ్), రూ.4,980 (డబుల్ షేరింగ్), రూ.4,960 (ట్రిపుల్ షేరింగ్). 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.4,060 (విత్ బెడ్), రూ.3,750 (విత్ అవుట్ బెడ్).