Mark Zandi: ఆర్థిక మాంద్యం అంచున అమెరికా.. మూడీస్ ఆర్థికవేత్త వార్నింగ్

US economic recession looming Moodys economist warns
  • ట్రంప్ టారీఫ్ లను తప్పుబట్టిన మార్క్ జాండీ
  • వలస విధానం, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాల ప్రభావం
  • నియామకాలు, పెట్టుబడులు ఆలస్యమవుతున్నాయని వెల్లడి
అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక రేటింగ్ కంపెనీ మూడీస్ చీఫ్ మార్క్ జాండీ హెచ్చరించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధాన నిర్ణయాలే ఇందుకు కారణమని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాండీ మాట్లాడుతూ.. ఇటీవల ట్రంప్ వివిధ దేశాలపై టారీఫ్ లు విధించిన విషయాన్ని ప్రస్తావించారు. టారీఫ్ లు ఆయా దేశాలతో పాటు అమెరికాపైనా ప్రభావం చూపిస్తాయని చెప్పారు. దీనికితోడు ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానం ఉద్యోగ నియామకాలను నెమ్మదించేలా చేసిందని చెప్పారు.

ఫెడరల్ రిజర్వ్ విషయంలో ట్రంప్ నిర్ణయాల ప్రభావం వ్యాపార రంగంపై భారీగా ఉందని, పెట్టుబడులు మందగించాయని వివరించారు. వీటన్నింటి ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతోందని జాడీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆర్థిక మందగమనం లక్షణాలు ఇంకా బయటపడనప్పటికీ నిర్మాణ రంగంతో పాటు ఉత్పాదక రంగంలో సూచనలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారీఫ్ ల ప్రభావం అమెరికాలోని వినియోగదారుడిపై ఇంకా పూర్తిస్థాయిలో కనిపించడంలేదని జాడీ తెలిపారు. ఈ సందర్భంగా ఇన్వెస్టర్లను జాడీ హెచ్చరిస్తూ.. ఆర్థిక మాంద్యంలో ఏ స్టాక్ కూడా సురక్షితం కాదని చెప్పారు.
Mark Zandi
US economy
America recession
Moody's
Donald Trump
Tariffs
Federal Reserve
Economic slowdown
Inflation
Investment

More Telugu News