Bhumana Karunakar Reddy: తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరైన భూమన

Bhumana Karunakar Reddy Attends Inquiry at Tirupati East Police Station
  • విగ్రహం వివాదం
  • భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు 
  • నోటీసులు ఇచ్చిన పోలీసులు
వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం అలిపిరి సమీపంలో విష్ణుమూర్తి విగ్రహం పడి ఉండటంపై ఆయన ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులను విమర్శిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే, ప్రభుత్వం అది శనీశ్వరుడి విగ్రహం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టం చేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కూడా అది శనీశ్వరుడి విగ్రహమేనని అన్నారు. ఈ నేపథ్యంలో భూమనపై కేసు నమోదు కాగా, ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేసు విషయంలో పోలీసులు ఆయన్ను విచారణకు పిలిచారు.

భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు హాజరైన సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన తిరుపతి ఎంపీ గురుమూర్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించేందుకు నిరాకరించారు. అదేవిధంగా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. స్టేషన్‌కు వెళ్లే దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

అలిపిరి వద్ద విగ్రహం లభించిన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చినందుకే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడినందుకు తప్పుడు కేసు బనాయించి, ఇలా విచారణ పేరుతో వేధిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Bhumana Karunakar Reddy
Tirupati
TTD
YCP
Alipiri
Vishnu Murthy Idol
Shani Idol
Andhra Pradesh Politics
Tirupati East Police Station
Guru Murthy

More Telugu News