Andhra Pradesh Government: ఏపీలో ప్రముఖ దేవాలయాల బోర్డులకు కొత్త ఛైర్మన్లు వీరే!

AP Government Appoints Chairmans to Temple Boards
  • ఏపీలోని ప్రముఖ ఆలయాలకు కొత్త సారథులు.. కీలక నియామకాలు పూర్తి
  • టీటీడీ సలహా కమిటీలకు కొత్త అధ్యక్షులు
  • ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల పాలకమండళ్లకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడిచే వివిధ నగరాల్లోని స్థానిక సలహా కమిటీలకు (లోకల్ అడ్వైజరీ కమిటీ) కూడా కొత్త అధ్యక్షులను నియమించింది.

వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లు వీరే...!

1. శ్రీ భ్రమమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం – పోతుగుంట రమేశ్ నాయుడు

2. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా – కొట్టె సాయిప్రసాద్

3. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం – వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)

4. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి – బొర్రా రాధాకృష్ణ (గాంధీ)

5. శ్రీ వెంకటేశ్వర ఆలయం, వాడపల్లి – ముదునూరి వెంకట్రాజు


టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు అధ్యక్షులు

1. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏ.వి. రెడ్డి

2. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్

3. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు

4. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఏడుగుండ్ల సుమంత్ రెడ్డి

5. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింఘానియా

6. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే
Andhra Pradesh Government
AP Temples
Temple Board Chairmans
TTD
Tirumala Tirupati Devasthanam
Pothugunta Ramesh Naidu
Kotte Saiprasad
V Surendra Babu
Borra Radhakrishna
Mudunuri Venkatraju

More Telugu News